Hyderabad : ప్రయివేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు

ఎల్.బి. నగర్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సులను ప్రయివేటు బస్సులు కూడా తిరుగుతున్నాయి.;

Update: 2025-01-11 02:38 GMT

ఎల్.బి. నగర్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సులను ప్రయివేటు బస్సులు కూడా తిరుగుతున్నాయి. దీంతో ఆర్టీఏ అధికారులు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఉదయాన్నే విజయవాడ వైపు వెళుతున్న, అటు వైపు నుంచి వస్తున్న వాహనాలను అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెద్దఅంబర్ పేట్, ఆరంఘర్ చౌరస్తా వద్ద కూడా తనిఖీలు చేస్తున్నారు. కొన్ని బస్సులను సీజ్ చేశారు.

నిబంధనలు పాటించని...
సేఫ్టీ సరిగ్గా లేని పది ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. సంక్రాంతి సందర్భంగా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు చేస్తున్నారు. దీంతో పాటు పర్మిట్ లు సక్రమంగా తీసుకోకుండానే హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు తిప్పుతుండటంపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై కేసు నమోదు చేస్తున్నారు.


Tags:    

Similar News