మూడు ఖండాల్లో వేలంపాట.. మద్యం బాటిళ్లను కోట్లు వెచ్చించి కొంటాడు

వియెట్ సేకరించిన వాటిలో అత్యంత అరుదైన కాగ్నాక్

Update: 2022-09-06 10:59 GMT

ఒక్కొక్కరికి ఒక్కో వస్తువును సేకరించడమంటే ఇష్టం. కొందరు కాయిన్స్ ను సేకరిస్తారు.. ఇంకొందరు స్టాంప్స్ ను సేకరిస్తూ ఉంటారు. చాలా అరుదుగా కొందరు మద్యాన్ని సేకరిస్తూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎక్కువ సమయం కేటాయించడం.. అందుకు తగ్గట్టుగా డబ్బు ఖర్చు చేసి మద్యాన్ని సేకరించాలి. 'న్గుయెన్ దిన్ టువాన్ వియెట్' అనే వ్యక్తి మద్యాన్ని సేకరించడానికి ఏకంగా వందల కోట్లను ఖర్చు చేశారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలెక్షన్ గా దీన్ని పరిగణిస్తూ ఉంటారు.

వియత్నాం కు చెందిన వ్యాపారవేత్త అయిన న్గుయెన్ దిన్ టువాన్ వియెట్ కు 2019లో అత్యంత విలువైన విస్కీ సేకరణ చేసిన వ్యక్తిగా బిరుదు లభించింది. దీని విలువ £13,032,468 ($16.7మి; €15మి).. ఆయన దగ్గర 535 బాటిళ్ల అరుదైన స్కాచ్, జపనీస్ విస్కీ కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు కాగ్నాక్(బ్రాందీ) విషయంలో కూడా సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కాగ్నాక్ కలెక్షన్‌ ఉన్న వ్యక్తిగా మరో రికార్డును సంపాదించుకున్నాడు. ప్రపంచంలోని అత్యంత అరుదైన, పురాతనమైన, అత్యుత్తమమైన 574 బాటిళ్లను కలిగి ఉన్నాడు. దీని మొత్తం విలువ £19,175,971 ($22.7m; €22.6m). అంటే భారత కరెన్సీలో 175 కోట్ల పైమాటే..!
వియెట్ సేకరించిన వాటిలో అత్యంత అరుదైన కాగ్నాక్ బాటిల్ 9-లీటర్ల 'లూయిస్ XIII లే సాలమనాజర్', దీని ధర £1.3 మిలియన్లు ($1.5మి; €1.5మి). ఉత్తర అమెరికా, యూరప్ మరియు ఆసియా.. మూడు ఖండాలను సూచించే మూడు సీసాలతో కూడిన ప్రపంచంలోని ఏకైక పూర్తి Louis XIII L'Odyssée d'un Roi కలెక్షన్ ఆయన వద్దే ఉంది. వీటిని ప్రతి ఖండంలోనూ నిర్వహించిన వేలంలో కొనుగోలు చేశాడు. ఈ మూడు సీసాల విలువ మొత్తం £7.6 మిలియన్ ($9m; €9.1m)గా ఉంది. ఇది అతడి కాగ్నాక్ సేకరణ మొత్తం విలువలో సింహ భాగం అని చెబుతారు.
ఇతర ప్రముఖ కలెక్షన్స్ లో గౌటియర్ కాగ్నాక్ 1762(Gautier Cognac 1762) ఉన్నాయి. ఇది వేలంలో విక్రయించబడిన పురాతన కాగ్నాక్ అని చెబుతుంటారు. 2014లో ఈ రికార్డును సాధించిన నిర్దిష్ట సీసాని Viet స్వంతం చేసుకోనప్పటికీ, ఉనికిలో ఉన్న మరో రెండింటిలో ఒకదానికి యజమానిగా ఉన్నాడు. Vieux Cognac 1734 Caves Gilot కూడా అతడి కలెక్షన్స్ లో ఉంది. ప్రతి కాగ్నాక్ బాటిల్‌కు ధరలను నిర్ణయించే పురాతన వైన్స్ & స్పిరిట్స్ డైరెక్టర్ జార్గ్ మాట్జ్‌డోర్ఫ్ ప్రకారం, ఇది అత్యంత పురాతనమైన కాగ్నాక్ అని.. వీటి విలువ భారీగా ఉంటుందని అన్నారు.
వియెట్ Viet 25 సంవత్సరాల క్రితం, 1996లో అరుదైన సీసాలను సేకరించడం ప్రారంభించాడు. వాటిని సేకరించడం మాత్రమే కాదు.. వాటిని తాగుతాడు కూడా. అతను ఓపెన్ చేసి తాగిన అత్యంత ఖరీదైన సీసా విస్కీ 'Karuizawa 1960'.. ఇది 52 ఏళ్ల పురాతనమైనది. ఇది £363,000 ($435k; €430k) వరకు బహిరంగ మార్కెట్లో విక్రయించబడుతుంది. అతడు అప్పుడప్పుడు తన దగ్గర ఉన్న మద్యం బాటిళ్లను వేలంపాటలో అమ్ముతూ కోట్ల రూపాయలను ఆర్జిస్తూ ఉంటాడు. 'మకాల్లన్ ఫైన్ & రేర్ 1926' బాటిల్ 60 ఏళ్ల పాతది £1,452,000 కి అమ్మాడు వియెట్. వేలంపాటలో అత్యధిక ధర పలికిన విస్కీ బాటిల్ ఇదే అని అంటుంటారు.
Macallan 1926 కి సంబంధించి కేవలం 40 సీసాలు మాత్రమే ఇప్పటివరకు విడుదల చేయబడ్డాయి. వాటిలో మూడింటిని వియెట్ కలిగి ఉన్నాడు. అతను మూడు రకాలను (ఫైన్ & రేర్ లేబుల్, పీటర్ బ్లేక్ లేబుల్, వాలెరియో అడామి లేబుల్) స్వంతం చేసుకున్న ప్రపంచంలోని ముగ్గురు వ్యక్తులలో ఒకడని నమ్ముతారు. అతని సేకరణలో ఉన్న మరొక స్కాచ్ కూడా ఉంది. అది 'బోమోర్ బాటిల్'.. అందులో 12 మాత్రమే విడుదలయ్యాయి. రేర్ విస్కీ 101 డైరెక్టర్ ఆండీ సింప్సన్ మాట్లాడుతూ ఇది "ప్రపంచంలో అత్యంత ఖరీదైన 'ఇస్లే' మాల్ట్ స్కాచ్ విస్కీ బాటిల్." అని చెప్పుకొచ్చారు.
వియెట్ కలెక్షన్ విలువ బహిరంగ మార్కెట్ ధరల ప్రకారంగా చెబుతున్నారు. అదే వేలంలో విక్రయించబడితే మాత్రం భారీగా సంపాదించవచ్చని అంటున్నారు. అతడి అరుదైన కలెక్షన్ ను అమ్మాలన్నా 12 నెలల పాటూ సాగుతుందని అంటుంటారు. అత్యంత అరుదైన కలెక్షన్స్ సొంతం చేసుకుని ఉన్నందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి వియెట్ ఎక్కారు. రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్‌కు యజమానిగా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తించబడినందుకు గౌరవంగా భావిస్తున్నానని వియెట్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. "గత 25 ఏళ్లలో నా కష్టానికి, అంకితభావానికి ఇది ఒక గుర్తింపుగా అనిపిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని కొత్త బాటిళ్లను సొంతం చేసుకోవడానికి.. నా స్వంత రికార్డులను బద్దలు కొట్టడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను." అని వివరించాడు.


Tags:    

Similar News