ఎడ్వర్డ్ నినో ఎత్తు 2 అడుగుల 4 అంగుళాలే.. ట్యాలెంట్ మాత్రం..!
అతను డ్యాన్స్ చేస్తే.. ప్రతి ఒక్కరూ అతడినే చూస్తారు. అతని ప్రతిభ అమోఘమని పలువురు ప్రశంసించారు.
ఎడ్వర్డ్ నినో(Edward Niño) చూడడానికి చాలా చిన్నగా ఉంటాడు. ఎంత చిన్నగా అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కే అంత చిన్నగా..! కానీ ఆయన ఆత్మవిశ్వాసం మాత్రం ఎవరెస్టు అంత ఎత్తు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మనిషిగా ఈ కొలంబియా వ్యక్తి రికార్డులకు ఎక్కాడు. ఎడ్వర్డ్ నినో వ్యక్తిత్వం ఎంతో గొప్పదని అందరూ చెబుతూ ఉంటారు. తక్కువ ఎత్తు ఉండటం తన అదృష్టమని అంటున్నారు.
కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ నినో 10 మే 1986న బొగోటాలో జన్మించాడు. అధికారికంగా ఆయన ఎత్తు 72.10 సెం.మీ (2 అడుగుల 4.3938 అంగుళాలు). ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి. 13 ఏప్రిల్ 2010న ఎడ్వర్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయ్యారు. ఆ సమయంలో 70.21 సెం.మీ (2 అడుగుల 3.64 అంగుళాలు) ఎత్తు ఉందని గిన్నీస్ రికార్డులో పొందుపరిచారు. ఆ తర్వాత 67.08 సెం.మీ (2 అడుగుల 2.41 అంగుళాలు) ఎత్తుతో ఖగేంద్ర థాపా మగర్ (నేపాల్, 14, అక్టోబర్ 1992 జన్మించారు) రికార్డును బద్దలు కొట్టారు. ఖగేంద్ర విచారకరంగా 2020 జనవరి 17న 27 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 29 ఫిబ్రవరి 2020న, 72.1 cm (2 ft 4.38 in) ఎత్తుతో ఎడ్వర్డ్ 1.89 cm (0.744 in) మళ్ళీ రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఎడ్వర్డ్ నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. అతడు హైట్ పెరగలేదని తల్లిదండ్రులు గుర్తించారు. అతను తన స్నేహితుల లాగా ఎదగడం లేదని అతని కుటుంబం గ్రహించింది. అతని తల్లిదండ్రులు వైద్య సహాయం కోరినప్పటికీ, తీవ్రమైన హైపోథైరాయిడిజం నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి ఎదుగుదల ఆగిపోయింది. దాదాపు 20 సంవత్సరాల ముందు అతని సహజ ఎదుగుదల ప్రభావితమైంది. పొట్టిగా ఉన్నప్పటికీ.. ఎడ్వర్డ్ ఎల్లప్పుడూ జీవితంలో ఆనందంగా ఉంటాడు. ఆశావాదంతోనూ.. తనలో శక్తితో కష్టాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఎడ్వర్డ్ తన కుటుంబంతో సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటాడు. అతను తన ఖాళీ సమయాన్ని పలు గేమ్స్ ఆడడానికి మాత్రమే కాకుండా.. వ్యాయామం చేస్తూ గడుపుతూ ఉంటాడు. అతను మోడల్, డ్యాన్సర్‌గా కూడా పనిచేస్తున్నాడు. నృత్యం అతని అభిరుచి, సంగీతమంటే చాలా ఇష్టం.
అతను డ్యాన్స్ చేస్తే.. ప్రతి ఒక్కరూ అతడినే చూస్తారు. అతని ప్రతిభ అమోఘమని పలువురు ప్రశంసించారు. "నాకు డ్యాన్స్ చాలా ఇష్టం.. నా ఆనందాన్ని వ్యక్తీకరించడానికి ఒక మార్గం.. నేను నా చిన్న శరీరం ద్వారా సంగీతానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేయగలను. నేను ఇష్టపడేదాన్ని చేయడానికి నాకు ఎటువంటి అడ్డంకులు లేవని నేను నమ్ముతున్నాను" అని ఎడ్వర్డ్ నినో చెప్పుకొచ్చాడు.
ఎడ్వర్డ్ తన తల్లిదండ్రులు మరియు తోబుట్టువులతో బొగోటా సమీపంలో నివసిస్తున్నాడు. అతను తన ఇంటిని చూసుకోవడంలో ఆనందం ఉందని చెబుతూ ఉంటాడు. అతను ప్రత్యేకంగా తన గదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటిని తుడుచుకోవడం, తన జంతువులకు ఆహారం పెట్టడం, వాటిని చూసుకోవడానికి ఇష్టపడతాడు. అతని వద్ద కోళ్లు, పందులు, ఆవులు, కుందేళ్లు.. వంటి పలు జంతువులు ఉన్నాయి.
తనను ప్రపంచం ఓ మంచి వ్యక్తిగా గుర్తు పెట్టుకోడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు ఎడ్వర్డ్. నా నవ్వే ప్రపంచాన్ని జయించేలా చేస్తుందని ఎడ్వర్డ్ చెబుతూ ఉంటాడు. నేను ఎల్లప్పుడూ నా చిరునవ్వును అందరితో పంచుకుంటాను.. అది ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుందని గుర్తించగలనని నినో చెప్పుకొచ్చాడు. "నేను అనుకున్న ప్రతిదాన్ని నేను సాధించగలను. ప్రతిదీ సాధ్యమే.. నా పరిమాణం, ఎత్తు పట్టింపు లేదు! నేను పరిమాణంలో చిన్న వాడిని, కానీ నా హృదయం చాలా విశాలమైనది!" అని అంటాడు ఎడ్వర్డ్. ఎడ్వర్డ్ అతని నలుగురు తోబుట్టువులలో పెద్దవాడు. అతడిపై కుటుంబం ఎంతో ప్రేమ చూపిస్తుంది.. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాడు. తాను సానుకూలంగానూ, దృఢంగానూ తయారవ్వడానికి తన తల్లి ఇచ్చిన మద్దతేనని అంటుంటాడు ఎడ్వర్డ్. నాకు ఎటువంటి కష్టం తెలియకుండా నన్ను నడిపించింది మా అమ్మ.
ఎడ్వర్డ్ సోదరుడు మిగ్యుల్ కూడా పెద్దగా ఎత్తు పెరగలేదు. మిగ్యుల్ వయసు 22 సంవత్సరాలు. 1.20 మీటర్ల పొడవు ఉంటాడు. మిగ్యుల్ హిప్ డిస్ప్లాసియాతో బాధపడుతున్నాడు. కొన్నిసార్లు నొప్పి కారణంగా నడవలేకపోతున్నాడు. ఎడ్వర్డ్ అతనికి తోడుగా ఉంటాడు, ఎంతగానో ప్రోత్సహిస్తాడు.
ఎడ్వర్డ్ కు ప్రపంచం మొత్తాన్ని చుట్టేయాలంటే ఎంతో ఇష్టం. ఇప్పటి వరకు అర్జెంటీనా, చిలీ, ఈక్వెడార్ వంటి దేశాలను సందర్శించే అవకాశం వచ్చింది. "నేను టెలివిజన్‌లో చూసే ఇతర సంస్కృతులను, వారి ఆహారాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను తెలుసుకోవాలని నేను ఇష్టపడతాను. నా బకెట్ లిస్ట్ లో యునైటెడ్ స్టేట్స్, యూరప్ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను." అని ఎడ్వర్డ్ నినో చెప్పుకొచ్చాడు.