ఊహించి కూడా...
ఇది ఒకరోజుతో దక్కిన విజయం కాదు. రెండు దశాబ్దాల శ్రమ. అయితే ఇందులో ఒకటి ఉంది. రెండు దశాబ్దాలంటే రాజకీయాల్లో పెద్ద సమయమేమీ కాదు. చాలా చిన్న సమయమే. అంత దాకా ఎందుకు... ఎంత మంది సీనియర్లు... పార్టీ అధ్యక్షుడిగా కాదు... ముఖ్యమంత్రి పేరు కూడా వారి నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఊహించనూ లేరు. ఊహించకూడదు కూడా. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఉన్న వారికి అది సాధ్యం కాని పని. తెలుగుదేశం పార్టీలో రేవంత్ కంటే సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. మంత్రి పదవులను దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి వరకూ వెళ్లారు. అది ఆరోవేలే. అంతే తప్ప అంతకు మించి ఎదుగుదల ఉండదు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో అలా జరగలేదు... రాజకీయాలనే నమ్ముకున్న రేవంత్ కు అదృష్టం కూడా వెంట పరుగులు తీసిందనే చెప్పాలి.
ఈ సీనియర్లంతా...
ఉదాహరణకు నాగం జనార్థన్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. వీళ్లంతా టీడీపీలో రేవంత్ రెడ్డి కన్నా సీనియర్లు. సీనియర్లే కాదు. జిల్లాలను శాసించిన వారు కూడా ఉన్నారు. వారు ఎదుగుతూ మరొకరిని ఎదగనివ్వని నేతలు కూడా ఇందులో ఉన్నారు. కానీ వారికి మంత్రి పదవులు తప్పించి మరో మెట్టు ఎదగలేకపోయారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి రావడంతో మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ పదవులు వంటి వాటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి ఆలోచ
న కూడా వారి మైండ్ లోకి వచ్చి ఉండదు. వచ్చే వీలుండదు కూడా. అలాంటి సీనియర్లను దాటి టీడీపీలోకి చాలా రోజుల తర్వాత తమకంటే ఆలస్యంగా వచ్చిన రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవుతారని కూడా భావించి ఉండరు.
కుదిరితే సీఎం...
ఇప్పుడు మరో ఛాన్స్ వస్తే రేవంత్ ముఖ్యమంత్రి అవుతారు. అదే జరిగితే రాజకీయాల్లో ఎవరికి ఏది దక్కుతుందో అంతవరకూ ఫలమని అనుకోవాలి తప్ప మరోదారి లేదు. పైన చెప్పిన నేతలంతా పదవువల్లో ఒక వెలుగు వెలుగుతున్నపపుడు బహుశ రేవంత్ రెడ్డి పేరు కూడా ఎవరికీ తెలిసి ఉండదు. అలాంటిది ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నాడంటే అది కాలంతో పాటు లక్ కూడా కలసి రావాల్సి ఉంటుంది. సీనియర్ నేతలమని చెప్పుకునే నేతలకన్నా... ఎప్పుడు ఏ పార్టీలో చేరి... ఎలా వ్యవహరించడమో రేవంత్ ను చూసి ఈ తరం యువనేతలు నేర్చుకోవడం మంచిదన్న సూచనలు.. సెటైర్లు కూడా వినపడుతున్నాయి. ఇది రేవంత్ ను పొగడటం.. మరొకరిని కించపర్చడం కాదు కానీ...ఎవరికీ పట్టని అదృష్టం రేవంత్ కే పడుతుందంటే అందుకు కారణం... ఎవరు..? ఇంకా డౌటా.. అందుకు కారణం రేవంతే. .. నో డౌట్.