క్రికెట్ మహా సంగ్రామం షెడ్యూల్ విడుదల

ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ను విడుదల చేశారు. ఐసీసీ మంగళవారం అధికారికంగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను

Update: 2023-06-27 09:04 GMT

ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ను విడుదల చేశారు. ఐసీసీ మంగళవారం అధికారికంగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 2019 సంవత్సరంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. లీగ్ దశలో భారత జట్టు మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. భారత్ జట్టు తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ 19న అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది.

ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో మూడు మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 6న పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్-1 జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 9 న న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్ -1 జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 12 పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్ -2 జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణె, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలోని స్టేడియాల్లో మ్యాచ్ లు జరుగుతాయి. గౌహతి, తిరువనంతపురంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత జట్టు మ్యాచ్ ల షెడ్యూల్:
అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో
అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘానిస్థాన్ తో
అక్టోబర్ 15న అహ్మదాబాద్ లో పాకిస్థాన్ తో
అక్టోబర్ 19న పూణెలో బంగ్లాదేశ్ తో
అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్ తో
అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లాండ్ తో
నవంబర్ 2 న ముంబైలో క్వాలిఫయర్ మ్యాచ్
నవంబర్ 5న కోల్ కతాలో సౌత్ ఆఫ్రికా
నవంబర్ 11న బెంగళూరులో క్వాలిఫయర్ మ్యాచ్


Tags:    

Similar News