IPL 2025 : ముంబయిని వణికించిన గుజరాత్.. సమిష్టిగా రాణించడంతో?
అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తో మరోసారి ఓటమి పాలయింది.;

ముంబయి ఇండియన్స్ కు కలసి రావడం లేదు. ప్లేయర్లు సమిష్టిగా రాణించడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా వరస వైఫల్యాలు ముంబయిని వెంటాడుతతూనే ఉన్నాయి. గత సీజన్ లో మొదలయిన ఈ పతనం నుంచి ఇంకా ముంబయి తేరుకోలేదనే పిస్తుంది. ఈ సీజన్ లో ప్రస్తుతం రెండు ఓటములను ముంబయి ఇండియన్స్ చవి చూసింది. మంచి బ్యాటర్లు, బౌలర్లున్నా ప్రత్యర్థిపైన రాణించలేకపోతున్నారు. ఏదీ కలసి రావడం లేదు. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తో మరోసారి ఓటమి పాలయింది.
తొలుత బ్యాటింగ్ చేసి...
గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది. 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ ను ముంబయి ఇండియన్స్ బౌలర్లు నిలువరించలేకపోయారు. ఓపెనర్లు ఇద్దరు నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పెంచుతూ వెళ్లారు. సాయి సుదర్శనం్ 63 పరుగులు చేశాడు. బట్లర్ 39 పరుగులు చేశాడు. గిల్ 38 పరుగులు చేశాడు. దీంతో ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేయగలిగింది. హార్ధిక్ పాండ్యా రెండు, దీపక్ చాహర్, ముజీబ్ చెరో ఒకటి వికెట్లు తీయగలిగారు.
ఛేదనలో బరిలోకి దిగి...
ఇక తర్వాత ఛేదనలో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ ఆదిలోనే తడబడింది. రోహిత్ శర్మ ఎప్పటిలాగానే ఎనిమిది పరుగులు చేసి వెనుదిరిగాడు. రిల్ కిటన్ ఆరు పరుగులకే అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే 48 పరుగులు చేసి పరవాలేదనిపించారు. తిలక్ వర్మ కూడా 39 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరును అందించే ప్రయత్నం చేశాడు. అంతే.. ఆ తర్వాత ఎవరూ పెద్దగా నిలబడలేదు. హార్ధిక్ పాండ్యా పదకొండు పరుగులుకు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో ముంబయి ఓటమి ఖాయమయింది. చివరకు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన ముంబయి ఇండియన్స్ 160 పరుగులను మాత్రమే చేయగలిగింది. సిరాజ్ రెండు, సాయికిశోర్ , ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీసి ముంబయి ఇండియన్స్ ఓటమికి కారణమయ్యారు. మరి ఎప్పటికి ముంబయి తేరుకుంటుదన్నది వారికే తెలియాలి.