ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది

ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ వచ్చేసింది. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధిపతి ఆసియా కప్ షెడ్యూల్ ను

Update: 2023-07-20 02:07 GMT

ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ వచ్చేసింది. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధిపతి ఆసియా కప్ షెడ్యూల్ ను జై షా ప్రకటించారు. బీసీసీఐ కోరినట్లుగానే ఈ టోర్నమెంట్‌ హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. ఆగస్టు 30న పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో పాకిస్థాన్-నేపాల్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. గ్రూప్ దశలో భారత్-నేపాల్ సెప్టెంబర్ 4న తలపడనున్నాయి. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 టోర్నీ జరగనుంది. ఆరు దేశాలు పాల్గొనే ఈ మినీ టోర్నీలో నాలుగు మ్యాచ్ లు పాకిస్థాన్ లో, తొమ్మిది మ్యాచ్ లు శ్రీలంకలో జరగనున్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్, గ్రూప్ బీలో బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, శ్రీలంక ఆడనున్నాయి. సెప్టెంబర్ 17న కొలంబోలో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. మూడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, ఒక సూపర్ ఫోర్ స్టేజ్ మ్యాచ్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. మిగతా అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరగనున్నాయి.

నసీమ్ సేథీ నేతృత్వంలోని పీసీబీ మాజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతిపాదించిన హైబ్రిడ్ ఫార్మాట్ ప్రకారం.. ఈ ఈవెంట్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరుగుతుంది. పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరించిన తర్వాత ఈ ఫార్మాట్‌ను రూపొందించారు. పీసీబీ మొదట్లో ఆసియా కప్ కోసం హైబ్రిడ్ ఫార్మాట్‌ను వ్యతిరేకించారు. కానీ తర్వాత అంగీకరించారు.
ఆసియా కప్‌ షెడ్యూల్‌
ఆగస్టు 30 పాకిస్థాన్‌X నేపాల్‌- ముల్తాన్‌
ఆగస్టు 31 బంగ్లాదేశ్‌X శ్రీలంక- క్యాండీ
సెప్టెంబరు 2 భారత్‌X పాకిస్థాన్‌- క్యాండీ
సెప్టెంబరు 3 బంగ్లాదేశ్‌X అఫ్ఘానిస్థాన్‌- లాహోర్‌
సెప్టెంబరు 4 భారత్‌X నేపాల్‌- క్యాండీ
సెప్టెంబరు 5 అఫ్ఘానిస్థాన్‌X శ్రీలంక- లాహోర్‌
సూపర్‌-4 మ్యాచ్‌లు
సెప్టెంబరు 6 ఎ1X బి2 -లాహోర్‌
సెప్టెంబరు 9 బి1X బి2 -కొలంబో
సెప్టెంబరు 10 ఎ1 X ఎ2 -కొలంబో
సెప్టెంబరు 12 ఎ2X బి1 -కొలంబో
సెప్టెంబరు 14 ఎ1X బి1 -కొలంబో
సెప్టెంబరు 15 ఎ2Xబి2  -కొలంబో
ఫైనల్‌: సెప్టెంబరు 17- కొలంబో


Tags:    

Similar News