ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు దక్కింది. దీంతో 2028లో జరిగే ఒలింపిక్ పోటీల్లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి.;

ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు దక్కింది. దీంతో 2028లో జరిగే ఒలింపిక్ పోటీల్లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఇందులో ఆరు జట్లు పాల్గొననున్నాయి. దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ కు మళ్లీ చోటు దక్కింది. ఆతిథ్య జట్టు అమెరికాతో పాటు మరో ఐదు టీంలు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. అమెరికాకు ఈ పోటీల్లో పాల్గొనేందుకు డైరెక్ట్ ఎంట్రీ లభిస్తుంది.
క్వాలిఫికేషన్ ప్రక్రియ మాత్రం...
పురుషులు, మహిళల విభాగాల్లో టీ20 ఫార్మాట్ లో ఈ పోటీలు నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే ఆ ఐదు జట్లు ఎంపిక ఎలా అన్న దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే వన్డే ఛాంపియన్ షిప్ తరహాలో క్వాలిఫికేషన్ ప్రక్రియ ఉండే అవకాశాలున్నయానిచెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీ 20 ఫార్మాట్ లో వంద దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో అమెరికాను మినహాయిస్తే మరో ఐదు జట్లను ఎంపికచేయడం కష్టంగా మారుతుందంటున్నారు.