IPL 2025 : నేడు మరో కీలక మ్యాచ్
నేడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ తలపడనుంది.;

ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు సమానమైన బలాబలాలు కలిగి ఉండటంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. నేడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ తలపడనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. బెంగళూరుకు సొంత మైదానం కావడంతో కొంత అచ్చొచ్చే అంశంగా చెప్పాలి.
బలాబలాలు....
ఇప్పటి వరకూ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ మూడు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటుతో ఉంది. ఇప్పటి వరకూ ఈ సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ ఓటమిని చవి చూడలేదు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో గెలిచి ఒక మ్యాచ్ లో ఓటమి పాలయింది. దీంతో ఈ మ్యాచ్ మాత్రం రసవత్తరంగా జరగనుంది.