Rohith Sharma : రైటర్ మెంట్ పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన రిటైర్ మెంట్ పై క్లారిటీ ఇచ్చారు. సిడ్నీటెస్ట్ కు ఎందుకు దూరంగా ఉండాల్సివచ్చిందో కూడా ఆయన వివరించారు.;

Update: 2025-01-04 02:50 GMT
rohit sharma, hit man,  clarity, retirement
  • whatsapp icon


 



హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన రిటైర్ మెంట్ పై క్లారిటీ ఇచ్చారు. సిడ్నీటెస్ట్ కు ఎందుకు దూరంగా ఉండాల్సివచ్చిందో కూడా ఆయన వివరించారు. తాను రిటైర్ కావడం లేదని, కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటున్నానని తెలిపారు. కొద్ది రోజుల నుంచి తాను పరుగులు చేయలేకపోవడంతో అనేక మంది విమర్శలు చేస్తున్నారని, కానీ రిటైర్ మెంట్ ను నిర్ణయించాల్సింది బయట వ్యక్తులు కాదని రోహిత్ శర్మ అన్నారు.

మరికొంత కాలం...
తాను మరికొంత కాలం ఆడతానని, ఎప్పుడు రిటైర్ అవ్వాలో తనకు తెలుసునని, తాను చిన్న పిల్లాడిని కానని,ఇద్దరు బిడ్డల తండ్రినని ఆయన చెప్పుకొచ్చారు. సిడ్నీ టెస్ట్ లో ఆడకపోవడానికి జట్టుకు ఉపయోగపడదామనే అన్న రోహిత్ తనపై నెగిటివ్ కామెంట్ చేసిన వారిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. వారు చెప్పినంత మాత్రాన తాను రిటైర్ కాబోనని ప్రకటించారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News