INDvsBAN: నితీష్ రెడ్డి ఆల్ రౌండర్ షో.. సిరీస్ భారత్ సొంతం

ఢిల్లీలో జరిగిన రెండో T20Iలో బంగ్లాదేశ్‌పై భారతజట్టు ఘన విజయాన్ని

Update: 2024-10-09 17:28 GMT

ఢిల్లీలో జరిగిన రెండో T20Iలో బంగ్లాదేశ్‌పై భారతజట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తో భారత్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 221 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగా.. బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో 135 పరుగులకు కట్టడి చేయడంతో 86 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

నితీష్ రెడ్డి తన కెరీర్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. రింకు సింగ్ మెరుపు హాఫ్ సెంచరీ కూడా తోడవ్వడంతో 221/9 పరుగులు భారత్ చేసింది. నితీష్ రెడ్డి కేవలం 34 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అందులో ఏడు అద్భుతమైన సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉన్నాయి. 21 ఏళ్ల రింకు సింగ్ (29 బంతుల్లో 53)తో కలిసి నాల్గవ వికెట్‌కు కీలకమైన 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇక భారీ స్కోరును ఛేజ్ చేసే క్రమంలో బంగ్లాదేశ్ ఎలాంటి పోరాటం కనబరచలేదు. 39 బంతుల్లో 41 పరుగులు చేసిన మహ్మదుల్లా టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లలో ఎవరూ 20 పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో నితీష్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీశారు. రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు. బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరికీ వికెట్ దక్కడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నితీష్ రెడ్డికి లభించింది. సిరీస్ లో ఆఖరి మ్యాచ్ ఈ శనివారం హైదరాబాద్ వేదికగా జరగనుంది.


Tags:    

Similar News