Team India Squad: టెస్టుల్లోకి పంత్ రీఎంట్రీ.. భారత జట్టు ప్రకటన!

బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19న చెన్నైలో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్

Update: 2024-09-08 17:10 GMT

బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19న చెన్నైలో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. రిషబ్ పంత్‌ను తిరిగి టెస్ట్ జట్టులోకి భారత్ తీసుకోవడం విశేషం. డిసెంబరు 2022లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత పంత్‌ను టెస్ట్ జట్టులోకి పిలవడం ఇదే తొలిసారి. ప్రమాదం నుండి కోలుకున్నాక T20 ప్రపంచ కప్ కు ముందు పంత్ IPL (13 మ్యాచ్‌లలో 446 పరుగులు)లో తన సత్తా చాటాడు. శ్రీలంకలో ODI సిరీస్ కూడా పంత్ ఆడాడు.

యష్ దయాల్ కు భారతజట్టులో చోటు లభించింది. బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి భారత జట్టులో మూడవ సీమర్ గా బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ సంవత్సరం రాంచీలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన ఆకాష్, దులీప్ ట్రోఫీ గేమ్‌లో ఇండియా A తరపున మంచి ప్రదర్శన ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్‌లో, ఇంగ్లండ్‌తో జరిగిన తన అరంగేట్ర సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో మూడు 50-ప్లస్ స్కోర్‌లతో మంచి ప్రదర్శన చేసిన సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు, కెఎల్ రాహుల్‌ కు కూడా భారత్ జట్టులో అవకాశం వచ్చింది. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌ స్పిన్ విభాగానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.

తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్.


Tags:    

Similar News