సంజూ పోరాడినా.. తొలి వన్డేలో భారత్ ఓటమి..!
లక్నోలో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా ఓటమిని మూటగట్టుకుంది
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లక్నోలో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ వైఫల్యం కారణంగా ఓటమిని మూటగట్టుకుంది. వర్షం కారణంగా 40 ఓవర్లకు మ్యాచ్ ను కుదించగా... 250 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 8 వికెట్లకు 240 పరుగులు మాత్రమే చేసి 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ 63 బంతుల్లో 86 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఆఖర్లో 6 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి రాగా.. 20 పరుగులు మాత్రమే రావడంతో భారత్ విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 39 ఓవర్ లో సంజూ శాంసన్ స్ట్రైక్ తీసుకోకపోవడం.. భారత్ విజయావకాశాలకు గండి కొట్టింది. శ్రేయాస్ అయ్యర్ 37 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. శార్దూల్ ఠాకూర్ 33 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (4), శుభ్ మాన్ గిల్ (3) విఫలం కావడం టీమిండియా ఛేజింగ్ పై ప్రభావం చూపింది. రుతురాజ్ గైక్వాడ్ 19, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 3 వికెట్లు తీయగా, రబాడా 2, పార్నెల్ 1, కేశవ్ మహరాజ్ 1, తబ్రైజ్ షంసీ 1 వికెట్ తీశారు.