India vs Afghanistan : తొలి మ్యాచ్ మనదే.. సిరీస్ ఆధిక్యం.. దూబే లేకుంటే?
ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో భారత్ దే విజయం అయింది. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది
India vs Afghanistan: ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో భారత్ దే విజయం అయింది. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక దశలో భారత్ ఓటమి తప్పదని భావించినా చివరకు భారత్ దే పై చేయి అయింది. శివమ్ దూబే అర్థ సెంచరీ బాది జట్టును ఆదుకున్నాడు. అలాగే జితేష్ శర్మ, శుభమన్ గిల్, రింకూ సింగ్ ల కీలక ఇన్నింగ్స్ తో ఆప్ఘనిస్థాన్ పై ఇండియా విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో భారత్ 1 - 0 ఆధిక్యంతో నిలిచింది.
గౌరవప్రదమైన స్కోరు...
తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అయితే తొలి ఆరు ఓవర్లలో బాగా ఆడిన ఆప్ఘన్లు ఆ తర్వాత వరసగా తడబడి పోయారు. శివం దూబే, అక్షర్ పటేల్ చేతికి చిక్కి వరస పెట్టి పెవిలియన్ బాట పట్టారు. ఆ జట్టులో మహ్మద్ నబీ ఒక్కడే 42 పరుగులు చేసి అత్యధికంగా రన్స్ చేసినట్లయింది. దీంతో ఆప్ఘనిస్థాన్ ఇరవై ఓవర్లకు కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసింది. గౌరవ ప్రదమైన స్కోరు చేసిన ఆప్ఘనిస్థాన్ తర్వత మ్యాచ్ ను తన చేతిలోకి తీసుకోవాలని భావించింది.
రోహిత్ మళ్లీ నిరాశపర్చినా...
159 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే తడబడింది. అనుకున్నట్లుగానే రోహిత్ శర్మ వెంటనే అవుటయ్యాడు. కేవలం 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ అభిమానుల్లో విజయంపై అనుమానాలు బయలుదేరాయి. శుభమన్ గిల్ 23 పరుగులకు అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ, శివమ్ దూబే నిలకడగా ఆడుతుండటంతో భారత్ స్కోరు పెరిగింది. శివమ్ దూబే 60, జితేశ్ శర్మ 31, రింకూ సింగ్ 16పరుగుల చేసి భారత్ ను విజయం బాట పట్టించాడు. 18 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని సాధించింది.