IPL 2025 : నేడు అదిరిపోయే జట్ల మధ్య రసవత్తర పోరు
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది;

ఐపీఎల్ లో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. అంచనాలు లేని జట్లు ఊహించని విధంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుండగా, గత సీజన్ లో దుమ్మురేపిన జట్లు మాత్రం ఈ సీజన్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదు. అందుకే పొట్టి కప్పులో ఏ జట్టు ఎప్పుడు ఎలా ముందుకు వచ్చి విజయాన్ని అందుకుంటుందన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. చిందంబరం స్టేడియంలో రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ జరగనుంది.
రెండు జట్లు...
ప్రస్తుతం కోల్ కత్తా నైట్ రైడర్స్ పడుతూ లేస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడిన కోల్ కత్తా నైట్ రైడర్స్ మూడింటిలో గెలిచి రెండు మ్యాచ్ లో ఓటమిపాలయింది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఐదు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ఈ సీజన్ మొత్తం అందుబాటులో లేకుండా పోవడంతో కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ వ్యవహరించనున్నారని జట్టు యాజమాన్యం ప్రకటించింది.