India vs England Fitfth T20: పిచ్ రిపోర్ట్ ఏం చెబుతుందంటే.. మతి పోవడం ఖాయమంటారా?
భారత్ - ఇంగ్లండ్ మధ్య ఆఖరి టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది;

భారత్ - ఇంగ్లండ్ మధ్య ఆఖరి టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను ముగించాలని భావిస్తుంది. అయితే అదే సమయంలో ఇంగ్లండ్ కూడా కసితో రగిలిపోతుంది. సిరీస్ చేజారిపోయినా తమపై గెలుపు అంత సులువు కాదని ఈ మ్యాచ్ ద్వారా చెప్పాలనుకుంటుంది. అందుకోసమే ఇంగ్లండ్ ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్నారు. నెట్ లో రెండు రోజుల నుంచి ప్రాక్టీసు విపరీతంగా చేశారు.
ముంబయిలో జరిగే...
ముంబయి పిచ్ ను పరిశీలిస్తే పరుగుల వరద ఖాయమని పిస్తుంది. పిచ్ పరుగులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లకు ఈ పిచ్ స్వర్గధామం అని చెప్పాలి. అందుకోసమే ఈ మ్యాచ్ లో కనీసం రెండు వందల పరుగులు లక్ష్యంగా ఇరు జట్లు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఓపెనర్లు కనీసం ఐదు నుంచి ఆరు ఓవర్లు నిలబడితే చాలు పరుగుల వరద పారినట్లేనని భావిస్తున్నారు. అందుకే ముంబయిలో జరిగే ఈ మ్యాచ్ నామమాత్రమయినప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం కనువిందు చేయడం ఖాయమని క్రీడానిపుణులు చెబుతున్నారు.
ఇరు జట్లు స్వల్ప మార్పులతో...
భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. ఎందుకంటే సిరీస్ గెలవడంతో కొంత మార్పులు చేసి ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తుంది. అలాగే ఇంగ్లండ్ ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఓడిపోయి సిరీస్ చేజార్చుకోవడంతో కొన్ని మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉందంటున్నారు. టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్ తీసుకుని ఇండియాను కట్టడి చేయాలని ఇంగ్లండ్ భావిస్తుంది. భారీ పరుగుల లక్ష్యంగానే ఇంగ్లండ్ ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెడుతున్నారు. అదే సమయంలో భారత్ ఆటగాళ్లు సొంత గడ్డ కావడంతో రెచ్చిపోయి ఆడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. సో.. ఎలా చూసినా.. క్రికెట్ ఫ్యాన్స్ కు సండే మాత్రం పండగేనని చెప్పాలి.