Champions Trophy : నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది;

క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్ ఈ ఛాంపియన్ ట్రోఫీని నిర్వహిస్తుంది. గ్రూపు ఎ, గ్రూపు బిలుగా మొత్తం ఎనిమిది దేశాలు ఈ ట్రోఫీలో పాల్గొననున్నాయి. మిగిలిన దేశాలన్నీ పాకిస్థాన్ పిచ్ లపైనే ఆడనున్నాయి. భారత్ మాత్రం దుబాయ్ లో మాత్రమే ఆడనుంది. నేడు తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో న్యూజిలాండ్ తలపడబోతుంది. ఇరు జట్లు బలంగానే ఉన్నాయి. పాక్ వైపు విజయావకాశాలు బలంగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా.
ఇరుజట్లు బలంగా...
సొంత మైదానంలో ఆడుతుండటం, ఇటీవల దక్షిణాఫ్రికాపై సిరీస్ ను కైవసం చేసుకోవడంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసంతో ఉంది. కివీస్ ఆటగాళ్లు కూడా అంతే ధీమాతో ఉన్నారు. ప్రత్యర్థి ఎవరైనా విజయం తమదేనని అనుంటున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. వన్డే మ్యాచ్ లు కావడంతో యాభై ఓవర్లు ఉండటంతో క్రికెట్ ఫ్యాన్స్ కు పండగగానే చెప్పాలి. స్టార్ స్పోర్ట్స్ 18 లో ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లన్నీ లైవ్ లో వీక్షించవచ్చు. రేపు బంగ్లాదేశ్ తో భారత్ ఢీకొంటుంది.