IPL 2025 : నేడు మరో కీలక మ్యాచ్
నేడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.;

నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి ఏడున్నర గంటలకుమ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆశించినంత రీతిలో రాణించడం లేదు. మంచి బ్యాటర్లు, బౌలర్లున్నప్పటికీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు.
రెండు జట్లు...
రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లో గెలిచి మరో రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. గుజరాత్ టైటాన్స్ మాత్రం మంచి ఊపులో ఉంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లు గెలిచి, ఒక మ్యాచ్ లో ఓటమి పాలయింది. దీంతో ఈ మ్యాచ్ మరో ఉత్కంఠ పోరుతో ముగియనుంది.