India Vs Bangladesh T20 : నేడు భారత్ - బంగ్లాదేశ్ రెండో టీ20 మ్యాచ్

భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య నేడు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ వేదికగా రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది;

Update: 2024-10-09 02:18 GMT
india, bangladesh, T20 match, hyderabad
  • whatsapp icon

భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య నేడు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్ స్టేడియంలో వన్ సైడ్ గా గెలిచిన టీం ఇండియా ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను రెండో మ్యాచ్‌కే సొంతం చేసుకోవాలని ఇండియా భావిస్తుంది. గ్వాలియర్ మ్యాచ్ లో 128 పరుగుల లక్ష్యాన్ని 12 ఓవర్లలోనే టీం ఇండియా ముగించింది. కుర్రోళ్లతో నిండిపోయిన జట్టు కావడంతో టీం ఇండియా దూకుడు మీదుంది. ఐపీఎల్్ లో సక్సెస్ అయిన వాళ్లందరికీ ఇందులో చోటు కల్పించారు.

యువ ఆటగాళ్లతో...
సీనియర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకరిద్దరు మినహా అందరూ యువ ఆటగాళ్లే. మయాంక్ అగర్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి మొన్ననే అంతర్జాతీయ మ్యాచ్ లో అరగేట్రం చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత్ బలంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను గెలిచేందుకు ఆశలు సజీవంగా నిలుపుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తుంది. అందుకోసమే బంగ్లాదేశ్ ఇందుకోసం శ్రమిస్తుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇక్కడ బంగ్లాదేశ్ ఆడిన పదిహేను టీ20 మ్యాచ్‌లలో టీం ఇండియా కేవలం ఒకే ఒకసారి ఓడిపోయింది.


Tags:    

Similar News