Team India : ఇంకెంత కాలం ఈ జిడ్డు ఆట భయ్యా... ఇక చాలు బ్రో

కొత్త ఏడాది టీం ఇండియాకు సీనియర్ ఆటగాళ్లు గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అవుననే చెప్పాలి;

Update: 2025-01-02 12:22 GMT

కొత్త ఏడాది టీం ఇండియాకు సీనియర్ ఆటగాళ్లు గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అవుననే చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మ రేపు సిడ్నీలో జరిగే టెస్ట్ క్రికెట్ చివరిది అని అంటున్నారు. ఈ టెస్ట్ తర్వాత రోహిత్ శర్మ తన రిటైర్ మెంట్ ప్రకటించే ఛాన్స్ ఎక్కువగా వినిపిస్తుంది. మెల్ బోర్న్ టెస్ట్ లో పేలవమైన ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ రిటైర్ మెంట్ డెసిషన్ తీసుకున్నారన్న వార్తలు అంతర్జాతీయ పత్రికల్లోనూ దర్శనమిస్తున్నాయి. అలాగే విరాట్ కోహ్లి విషయంలోనూ ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. మెల్ బోర్న్ టెస్ట్ లో భారత్ దారుణంగా విఫలమవ్వడానికి కారణం రోహిత్, విరాట్ కోహ్లిలేనని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అభిప్రాయపడుతున్నారు.

తక్కువ పరుగులకే...
మెల్ బోర్న్ టెస్ట్ లో టీం ఇండియా ఓటమి పాలయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీలో ఫైనల్ లో చోటు క్లిష్టతరం చేసుకుంది. ఇందుకు కారణమైన సీనియర్ ఆటగాళ్లపై గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్దయెత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక చాలు భయ్యా.. అని కామెంట్స్ పెడుతున్నారు. మెల్ బోర్న్ టెస్ట్ లో రోహిత్ శర్మ మూడు పరుగులు, తర్వాత ఐదు పరుగులు చేసి అవుటయ్యాడు. అలాగే విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేసినా, రెండో టెస్ట్ లో తక్కువ పరుగులకే అవుటయ్యాడు. బౌలర్లు తక్కువ పరుగులకే ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయగలిగినా సీనియర్ ఆటగాళ్లు బ్యాట్ తడబడటంతోనే ఓటమికి కారణమని చెబుతున్నారు.

పెద్దయెత్తున ట్రోలింగ్...
రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ను బీసీసీఐ ఇంకా ఖరారు చేయకపోయినా మరికొంత కాలం కొనసాగాలని కోరుతున్నట్లు తెలిసింది. అయితే రోహిత్ శర్మ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో విరాట్ కోహ్లిపై కూడా ట్రోలింగ్ నడుస్తున్నప్పటికీ అతను ఇంకా రిటైర్ మెంట్ డెసిషన్ తీసుకోలేదని చెబుతున్నారు. కెఎల్ రాహుల్ కూడా రిటైర్ అయితే బెటరన్న కామెంట్స్ ఇటీవల కాలంలో ఊపందుకున్నాయి. ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు జట్టుకు భారంగా మారారన్నది మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టేస్తుండటంతో ముగ్గురికీ త్వరలో ఉద్వాసన తప్పేట్లు లేదు. అందుకే ముందుగానే తప్పుకుంటే మంచిదన్న భావనలో వారున్నారని కథనాలు వెలువడుతున్నాయి. సిడ్నీ టెస్ట్ తర్వాత భారత జట్టులో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News