మెరిసిన భారత్ ఫుట్ బాల్ టీమ్.. కోటి రూపాయల బహుమతి

ఇంటర్ కాంటినెంటల్ కప్ ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఇండియా 2–0తో లెబనాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం

Update: 2023-06-19 02:53 GMT

భారత్ లో క్రికెట్ కు ఉన్న ఆదరణ కారణంగా మిగతా ఆటలను పెద్దగా పట్టించుకోవడం లేదు భారతీయులు. ఒకప్పుడు హాకీలో భారత్ సంచనాలు సాధించగా.. క్రికెట్ కు వచ్చిన సూపర్ రెస్పాన్స్ కారణంగా పట్టించుకోవడమే మానేశారు. ఇక భారత ఫుట్ బాల్ జట్టును ఎంకరేజ్ చేసే వాళ్లే లేకుండా పోయారు. కేవలం కేరళ, నార్త్ ఈస్ట్ వంటి రాష్ట్రాల్లో ఫుట్ బాల్ కు ఆదరణ కొనసాగుతూ ఉంది. తాజాగా భారత ఫుట్ బాల్ టీమ్ మేజర్ టోర్నమెంట్ ను గెలిచింది.

ఇంటర్ కాంటినెంటల్ కప్ ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఇండియా 2–0తో లెబనాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించింది. 2018లో ఆరంభ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచిన ఇండియాకు ఇది రెండో కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛెత్రి 87వ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా.. ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్క గోల్​ రాలేదు. బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన వెంటనే 46వ నిమిషంలో లలియాంజులా చాంగ్టే ఇచ్చిన క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకున్న ఛెత్రి ఇండియాకు గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించాడు. ఆపై 66వ నిమిషంలో చాంగ్టే చేసిన గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఛెత్రిసేన ఘన విజయం సాధించింది.
భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో, మొదటి అర్ధభాగంలో రెండు జట్లూ గోల్ కోసం ప్రయత్నించాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాయి. 'మొదటి అర్ధభాగంలో జట్టు గోల్ చేయలేకపోయింది. సెకండాఫ్‌లో భారత జట్టు బాగా స్పందించింది. గత ఐదు దశాబ్దాల్లో భారత ఫుట్ బాల్ జట్టుకు ఇది అత్యుత్తమ 45 నిమిషాలు”అని కోచ్ ఇగోర్ స్టిమాక్ మ్యాచ్ తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. విజేత ట్రోఫీని భారత జట్టు కెప్టెన్ ఛెత్రీకి అందజేసిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, భారత జట్టుకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించారు.


Tags:    

Similar News