తెలంగాణలో కరోనా విజృంభణ.. స్కూల్లో 15 మందికి పాజిటివ్

తాజాగా తెలంగాణలోనూ కరోనా కేసులు పెరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకింది.

Update: 2023-04-06 13:33 GMT

దేశంలో రోజువారీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 1000 లోపు నుంచి నమోదయ్యే పాజిటివ్ కేసులు.. ఇప్పుడు 5000 కు పైగానే నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ బుధవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 25 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 15 మంది కరోనాతో మరణించారు.

తాజాగా తెలంగాణలోనూ కరోనా కేసులు పెరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలుర గురుకుల పాఠశాలలో ఏకంగా 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు జ్వరం, జలుబు ఉండటంతో గురువారం వైద్యులు పరీక్షించగా.. 15 మందికి పాజిటివ్ గా తేలడంతో.. వారందరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి 15 మందికి పాజిటివ్ గా తేలడంతో.. మిగతా విద్యార్థులను పేరెంట్స్ ఇళ్లకు తీసుకెళ్తున్నారు.


Tags:    

Similar News