హైదరాబాద్ లో రేపు 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

లింగంపల్లి-హైదరాబాద్ మీదుగా నడిచే 9 రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మీదుగా నడిచే 9 సర్వీసులు, ఫలక్ నుమా-లింగంపల్లి మీదుగా

Update: 2022-01-16 12:28 GMT

జనవరి 17వ తేదీ, సోమవారం హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. నగరంలో పలు రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తోన్న మార్గాల్లో 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్ మీదుగా నడిచే 9 రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మీదుగా నడిచే 9 సర్వీసులు, ఫలక్ నుమా-లింగంపల్లి మీదుగా 8 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే.. లింగంపల్లి-ఫలక్ నుమా మీదుగా నడిచే 8 రైలు సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ మీదుగా నడిచే రెండు రైల్వే సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది.



Tags:    

Similar News