Congress : కేసీఆర్‌కు ఖర్గే సవాల్
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. పైగా కర్ణాటకలో కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి దిగిందన్నారు. వాటిని ఎవరూ నమ్మవద్దని కోరారు. అవసరమైతే పక్క రాష్ట్రానికి వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించుకోవాలని ఆయన కోరారు.
ఆరు గ్యారంటీలను...
కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లోనూ అప్పుల తప్ప అభివృద్ధి కనిపించలేదన్నారు. ఉద్యోగాలను కూడా సక్రమంగా భర్తీ చేయలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని ప్రజలు ఆదరించాలని మల్లికార్జునఖర్గే కోరారు. నరేంద్ర మోదీ పాలనలో కేవలం కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని, సామాన్యులకు భారంగా మారిందని ఆయన అన్నారు.