UPPSC : ఎవరీ అనన్య రెడ్డి... ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్ ఎలా సాధ్యమయింది?
యూపీపీఎస్సీ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించారు.
యూపీపీఎస్సీ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించారు. పాలమూరు అంటే వలసలకు ప్రసిద్ధి. అలాంటి జిల్లాలో పుట్టిన చదవుల తల్లి అనన్య రెడ్డి. కేవలం తొలి ప్రయత్నంలోనే అనన్య రెడ్డికి సివిల్స్ లో ర్యాంకు వచ్చిదంటే ఆమె కష్టాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనన్య రెడ్డి అదృష్టాన్ని నమ్ముకోలేదు. తన కష్టాన్ని నమ్ముకుంది. చుట్టూ ఉన్న తన ప్రాంతం పడే బాధలను చూసి ఆమె చలించింది. తాను ప్రజలకు సేవ చేయాలన్న కోరిక చిగురించింది. అదే ఆమె సక్సెస్ కు ప్రధాన కారణమని చెబుతుంది.
చిన్న నాటి నుంచే...
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోసూరు అనన్య రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లోనే దేశంలోనే మూడో ర్యాంకు సాధించడంతో ఆ చదువుల తల్లికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరు జిల్లాలోని పానకల్ గ్రామం అనన్య రెడ్డిది. చిన్నతనం నుంచే ఆమె చదువుల పట్ల ఆసక్తి కనపర్చేది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అనన్యరెడ్డి తాను ఎదిగి నలుగురికి సేవ చేయాలనుకున్నారు. అందుకు ఐఏఎస్ అయితేనే సాధ్యమని భావించారు. అందుకు ఆమె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మిరాండ హౌస్ లో జియోగ్రఫీ లో డిగ్రీ పూర్తి చేసిన అనన్య రెడ్డి ఆ సమయంలోనే సివిల్స్ కొట్టేయాలని భావించారు. కానీ అంత తేలిక కాదని ఆమెకు తెలుసు. కానీ తాను అనుకున్నది సాధించాలంటే.. రెండు..మూడు గంటలు సరిపోదు. రోజుకు పన్నెండు నుంచి పథ్నాలుగు గంటలు ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నారు. అనుకన్నట్లుగానే కొన్ని నెలలు పుస్తకాల పురుగుగానే మారింది అనన్య రెడ్డి. అంతే కాదు హైదరాబాదలో ఆంథ్రోపాలజీ మీద కోచింగ్ తీసుకుని దానిని ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఎంచుకున్నారు. కష్టపడి చదివి మూడో ర్యాంక్ కొట్టిన అనన్య రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెబుదాం. అందరు యువత అనన్య రెడ్డి బాటలో పయనించాలని ఆశిద్దాం.