Telangana : కేటీఆర్‌పై కేసు నమోదుకు సిద్ధం.. గవర్నర్‌‌ను అనుమతి కోరిన ఏసీబీ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది;

Update: 2024-11-08 02:59 GMT
anti-corruption department,  formula e race, ktr latest news today, brs  working president ktr,  case against brs working president ktr, telangana politics news

KTR

  • whatsapp icon

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అనుమతి కోరినట్లు తెలిసింది. ఫార్ములా ఈ వన్ రేసుకు సంబంధించి అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. రేసు నిర్వహణకు విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్ లో జరపాల్సిన ఫార్ములా వన్ రేసుకు సంబంధించి మెట్రోపాలిటిన్ డెవలెప్‌మెంట్ అథారిటీ అనుమతులు, ఫైనాన్స్ క్లియరెన్స్‌లు, మంత్రివర్గం సమ్మతి లేకుండా నిధులను బదిలీ చేసినందుకు ఏసీబీ దీనిపై దర్యాప్తు చేస్తుంది. అప్పటి మంత్రి కేటీఆర్, మాజీ కార్యదర్శి అరవింద్‌కుమార్ తో పాటు ఇతర అధికారుల పేర్లను కూడా ఏసీబీ పరిశీలిస్తుంది.

ఫార్ములా ఇ రేసు...
పార్ములా ఇ రేసు గత ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అది రద్దయింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిధులు ఫార్ములా రేసుకు చెల్లించిన 55కోట్ల రూపాయల నిధులను వెచ్చించడంపై దర్యాప్తు ప్రారంభమయింది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సయితం ఈ అంశం రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని, ఏసీబీ దర్యాప్తు కేవలం అవినీతి ఆరోపణలపై చేస్తుందని, రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాదని గతంలోనే తెలిపారు.ఒక మంత్రి గాని, అధికారి కానీ అంత పెద్ద మొత్తాన్ని ఎలా బదిలీ చేయగలరు? ఎవరు లాభపడాలి? అన్న దానిపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.
కేటీఆర్ ఏమన్నారంటే?
అయితే కేటీఆర్ కూడా ఈ ఫార్ములా రేసుకు సంబంధించి నిధులు విడుదల తనవల్లనే జరిగిందని అంగీకరించారు. తాను తప్పు చేయలేదని, బెదిరేది లేదని, అవసరమైతే తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్ానని, కేవలం బీజేపీ, కాంగ్రెస్ తనను లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఇ రేసింగ్ పై ఏ విచారణకైనా సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడనని, జైలుకెళ్లడానికైనా భయపడనని కేటీార్ తెలిపారు. పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. ఫార్ములా రేసింగ్ హైదరబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం కోసమేనని ఆయన తెలిపారు. పెట్టుబడుల కోసమే55 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, మున్సిపల్ శాఖ మంత్రిగా నాడు ఆ బాధ్యత తనదేనని కేటీఆర్ అంగీకరించడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదుకు సిద్ధమయినట్లు తెలిసింది. ఈ మేరకు గవర్నర్ అనుమతిని ఏసీబీ కోరిందని సమాచారం.

Tags:    

Similar News