బండి సంజయ్ కు అస్వస్థత

మండుటెండలో పాదయాత్ర చేయడం వల్ల బండి సంజయ్ వడదెబ్బకు గురయ్యారు. బండి సంజయ్ అస్వస్థతకు గురికావడంతో వెంటనే..;

Update: 2022-04-25 06:15 GMT

మహబూబ్ నగర్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొద్దిరోజులుగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా నిన్న నారాయణపేట్ మండలంలో పర్యటించారు. మండుటెండలో పాదయాత్ర చేయడం వల్ల బండి సంజయ్ వడదెబ్బకు గురయ్యారు. బండి సంజయ్ అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆయనకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యక్తిగత వైద్యుడు మాట్లాడుతూ.. తనకు శరీరంలో ఏదో తేడాగా ఉందని చెప్పడంతో వెంటనే చికిత్స చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితి బానే ఉందని, కొంచెం విశ్రాంతి అవసరమని సూచించినట్లు వైద్యుడు పేర్కొన్నారు. వ్యక్తిగత వైద్యుని సూచన మేరకు బండి సంజయ్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. స్థానిక బీజేపీ నేత జలంధర్ రెడ్డి నివాసంలో రెస్ట్ తీసుకున్న అనంతరం తన పాదయాత్రను కొనసాగించారు. ఈ రోజు ఆయన పాదయాత్ర గొల్లపల్లి, దండు క్రాస్ ల మీదుగా కొనసాగనుంది. పాదయాత్ర అనంతరం మక్తల్ టౌన్ లో బహిరంగసభను నిర్వహించనున్నారు.



Tags:    

Similar News