Breaking : ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు;
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ లను ఈ నెల 8,9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈరోజు బీఎల్ఎన్ రెడ్డి, రేపు అరవిందకుమార్ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది.
మరికొంత సమయం కావాలంటూ...
అయితే తమకు మరికొంత సమయం కావాలని ఈడీ అధికారులను కోరడంతో వారు అందుకు సానుకూలంగా స్పందించారు. మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో సహా హాజరు కావాలని చెప్పడంతో తమకు మూడు వారాలు గడువు కావాలని కోరినా అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి ఈ నెల8,9 తేదీల్లో విచారణకు తప్పనిసరిగా రావాలని కోరింది. ఈ నెల 7వ తేదీన కేటీఆర్ ను హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now