Raithu Bharosa : రైతు భరోసాపై లేటెస్టే అప్ డేట్ ఇదే..భట్టి టీం సూచనలివే

రైతుభరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయి విధివిధానాలపై చర్చించింది;

Update: 2025-01-02 11:52 GMT

రైతుభరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయి విధివిధానాలపై చర్చించింది. జనవరి 14వతేదీ నుంచి నుంచి రైతు భరోసా అమలు చేయాలని అభిప్రాయపడింది. పంట పండించే ప్రతి రైతుకు రైతుభరోసా ఇవ్వాలని ఈ భేటీలో చర్చ జరిగింది. రైతు భరోసా కోసం దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. జనవరి 5వతేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించాలని డిసైడ్ చేసినట్లు తెలిసింది. సాగు చేసే భూములకే రైతుభరోసా ఇచ్చే యోచనను ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అభిప్రాయపడింది.

సాగవుతున్నభూములను...
అలాగే తెలంగాణలో సాగవుతున్న భూములను శాటిలైట్‌ మ్యాపింగ్‌ ద్వారా గుర్తించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లు సమాచారం. ధరణి ప్రకారం కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేయని భూములు తీసేస్తే..కోటి 30 లక్షల ఎకరాలకు రైతుభరోసా ఇవ్వాలని ఉపసంఘం ప్రాధమికంగా అభిప్రాయపడింది. అలాగే పది ఎకరాల్లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఎకరానికి 7,500 రూపాయల తొలివిడతసాయానని అందించేందుకు అవసరమైన నిధులను రెడీ చేసిన తర్వాత విడతలవారీగా ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి పది ఎకరాలున్న రైతువరకూ రైతు భరోసా ఇచ్చేలా అధికారులు ప్లాన్ చేస్తే మంచిదని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది.

రేపు సీఎం వద్దకు..
అదే సమయంలో ఆదాయపు పన్నుచెల్లిస్తున్నవారికి, ప్రభుత్వోద్యోగులుగా ఉన్నవారికి ఈ పథకం ఇవ్వకూడదని కూడా ఉప సంఘం అభిప్రాయపడింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందేలా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు అధికారులు సమన్వయంతో పనిచేసి చేయాలని ఉపసంఘం సూచించింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉప సంఘం ఛైర్మన్ భట్టి విక్రమార్కకలసి తాము తీసుకున్న నిర్ణయాలను వివరించనున్నారు.అనంతరం ఈ నెల 4వ తేదీన జరిగే మంత్రి వర్గసమావేశంలో రైతు భరోసా పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే కౌలు రైతులకు కూడాసాయాన్నిఅందించే విషయంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయించాలని ఉప సంఘం అభిప్రాయపడింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News