తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ కమిటీలు ఇవే
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఇందుకోసం కమిటీలను నియమించింది
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఇందుకోసం కమిటీలను నియమించింది. బీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు మేనిఫేస్టో రూపకల్పన, బహిరంగ సభల నిర్వహణ, పబ్లిసిటీ, నిరసనల వంటి కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా నేతలతో సమావేశం జరుపుతున్నారు.
నాలుగు కమిటీలకు...
మొత్తం పథ్నాలుగు కమిటీలను బీజేపీ నియమించింది. తెలంగాణకు మొత్తం ఆరు జోన్లుగా విభజించుకున్నారు. ఒక్కో జోన్ కు ఒక్కో నేతను నియమించి పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల వారీగా కీలక నేతలకు బాధ్యతలను అప్పగించనున్నారు. మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్ గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్ గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నియమించింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ కమిటీ ఛైర్మన్ గా బండి సంజయ్, నిరసనల కమిటీ ఛైర్మన్ గా విజయశాంతి, ఛార్జ్‌షీట్ కమిటీ ఛైర్మన్ గా మురళీధరరావుని నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.