9వ రోజున బండి సంజయ్ పాదయాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేడు 9వరోజుకు చేరుకుంది;

Update: 2022-12-06 03:29 GMT
9వ రోజున బండి సంజయ్ పాదయాత్ర
  • whatsapp icon

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేడు 9వరోజుకు చేరుకుంది. ఐదో విడత పాదయాత్రను ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈరోజు దిమ్మదుర్తి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. రాజూరాగేట్ మీదుగా ఖానాపూర్ వరకూ బండి సంజయ్ పాదయాత్ర చేరనుంది.

ఈనెల 16న...
మధ్యలో ప్రజలతో కలసి ఆయన సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈనెల 16వ తేదీన బండి సంజయ్ తన ఐదో విడత పాదయాత్రను ముగించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశముంది. ఇక బస్సు యాత్ర ప్రారంభించాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది.


Tags:    

Similar News