Telangana : తెలంగాణలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది.;

Update: 2025-01-10 11:57 GMT

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలో నడ్డా ఆదేశాలతో అభ్యర్థులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి పేరు ఖరారయింది. కరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య ను ఖరారు చేశారు.

వీరి గెలుపు కోసం...
అలాగే కరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేరును ఖరారు చేస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ముగ్గురి గెలుపు కోసం ప్రత్యేకంగా ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసి గెలుపు సాధించేంత వరకూ కృషి చేయాలని నిర్ణయించారు. ఇతర ప్రాంతాల బీజేపీ కార్యకర్తలు కూడా ఈ ముగ్గురి గెలుపుకోసం ప్రచారంలో పాల్గొనాలని నేతలు పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News