మాజీ మంత్రి హరీశ్ రావుకు మరోసారి ఊరట
మాజీ మంత్రి హరీశ్ రావుకు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది.;
మాజీ మంత్రి హరీశ్ రావుకు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆయనను ఈ నెల 28వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హరీశ్ రావుపై కేసు నమోదయింది. చక్రధర్ గౌడ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధాని అంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును...
దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్ రావుపై కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హరీశ్ రావు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను మరోసారి పొడిగించింది. ఈ నెల 28వ తేదీ వరకూ హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనకు ఊరట లభించింది.