నేటి నుంచి "బండి" యాత్ర
నేటి నుంచి బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం కానుంది.
నేటి నుంచి బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం కానుంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రను చేపడుతున్నారు. ఈరోజు ఉదయం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు.
ప్రతి సెగ్మెంట్‌లో మూడు రోజులు
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేసిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్రను ప్రారంభించి తొలి విడత యాత్ర ఈ నెల 15 వరకు బండి సంజయ్ చేయనున్నా రని పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున మూడు రోజుల చొప్పున పర్యటించేలా రూట్ మ్యాప్ రూపొందించుకున్నారు.