ఆ భయంతోనే కేసీఆర్ సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పించారు : ఎన్వీ సుభాష్
ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ కామెంట్ చేశారు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ ఓటమి ఖాయం అని ఆయన జోష్యం చెప్పారు. అవినీతిలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ కు దోస్తీ అని ఆరోపించారు. తన అవినీతి ఎక్కడ బయట పడుతుందో అన్న భయంతోనే.. సిట్టింగులకు తిరిగి మళ్లీ కేసీఆర్ అవకాశం కల్పించారని సంచలన ఆరోపణ చేశారు.
బీఆర్ఎస్ తొలి జాబితాలో మహిళలకు ఎందుకు అత్యధిక సీట్లు కేటాయించలేదని ప్రశ్నించారు. మొదటి నుంచి కేసీఆర్ మహిళా వ్యతిరేకి అని అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు కేసీఆర్ ఎందుకు పాటించడం లేదు? అని ప్రశ్నించారు. మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. కేసీఆర్ విడుదల చేసిన తొలి జాబితాతోనే.. బీజేపీ గెలుపుకి మార్గం సుగమం అయ్యిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనన్నారు.