త్వరలోనే కవిత అరెస్ట్ : మాజీ ఎంపీ వివేక్

బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాబోతున్నారని ఆయన తెలిపారు;

Update: 2023-02-27 07:21 GMT
త్వరలోనే కవిత అరెస్ట్ : మాజీ ఎంపీ వివేక్
  • whatsapp icon

బీజేపీ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాబోతున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో త్వరలో కవిత అరెస్ట్ అవుతారని వివేక్ చెప్పారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న వివేక్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. సిసోడియా తరహలోనే త్వరలో కవిత కూడా అరెస్ట్ అవుతుందని తెలిపారు.

తెలంగాణ సంపదను...
తెలంగాణ సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకున్నారన్నారు. తెలంగాణలో దోచుకున్న అవినీతి డబ్బుతోనే బీఆర్ఎస్ పేరుతో దేశమంతా తిరుగుతున్నారని వివేక్ అన్నారు. తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాలలో ఖర్చుపెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణలోనే ఖతం అవుతుందని చెప్పారు. కేసీఆర్ చేసే జిమ్మిక్కులను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. తనపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ ను తీసుకొచ్చారని వివేక్ అన్నారు.


Tags:    

Similar News