Telangana : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.;

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ నాలుగున నామినేషన్లకు చివరి తేదీనగా పేర్కొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లయింది.
23న పోలింగ్...
హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో ఇక ఎన్నికల వార్ మొదలయినట్లే భావించాలి. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 23న పోలింగ్, ఏప్రిల్ 25 న కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్ లో పేర్కొన్నారు.