ఎల్ఆర్ఎస్ పై బాంబు పేల్చిన పొంగులేటి
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు;

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 31వ తేదీ ఎల్.ఆర్.ఎస్ కు తుదిగడువు అని ఆయన తెలిపారు. మార్చి 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకుంటే ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. తర్వాత ఎల్ఆర్ఎస్ పొడిగింపు ఉండదని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
భూముల విలువను...
అదే సమయంలో భూముల విలువ కూడా త్వరలోనే పెరుగుతాయని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందుకే ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇప్పుడే చేసుకోవడం మంచిదని, భవనాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత చేసుకుందామని భావిస్తే కుదరదని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అప్పుడు వందశాతం ఫీజు చెల్లించాల్సిందేని పొంగులేటి తెలిపారు.