హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు

ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రియంచారు.;

Update: 2025-03-23 04:34 GMT
prabhakar rao, former sib chief, phone tapping case, high court
  • whatsapp icon

ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రియంచారు. ముందస్తుబెయిల్ కోసం ఆయన పిటిషన్‌ వేశారు. క్యాన్సర్‌, లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌తో తాను బాధపడుతున్నానని ఆయన హైకోర్టులో వేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. చికిత్స కోసమే అమెరికాకు వచ్చానని ప్రభాకర్‌రావు తెలిపారు. తనను నిందితుడిగా చేర్చడానికి ముందు అమెరికా వచ్చానని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు.

ఎక్కడకూ పారిపోలేదు...
తాను పారిపోయానని ముద్ర వేయడం సరికాదన్న ప్రభాకర్ రావు తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని ప్రభాకర్‌రావు తెలిపారు. తన ఆరోగ్యం దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా తనపై కేసు నమోదు చేయడంపై ఆయన ఈ బెయిల్ పిటీషన్ వేశారు.


Tags:    

Similar News