అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట
ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట లభించింది;

ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్‌లో విచారణ ముగిసేంత వరకు తెలంగాణలోనే అభిషేక్ మహంతి విధులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అభిషేక్ మహంతికి హైకోర్టులో రిలీఫ్ దక్కినట్లయింది. తెలంగాణ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీకి వెళ్లిపోవాలంలూ చేస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ సంగతి తెలిసిందే.
ఏపీకి పంపుతూ...
అందులో అభిషేక్ మహంతి ఒకరు. ఆయన తనను ఏపీకి పంపడంపై ఆయనను క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ లో అభిషేక్ మహంతి పిటీషన్ పై విచారణ జరుగుతుంది. దీంతో ఏపీకి బదిలీ చేస్తూ గతంలో డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులు క్యాట్ లో విచారణ ముగిసేంత వరకూ నిలిపేయాలని, అప్పటి వరకూ తెలంగాణలో విధులు నిర్వహించవచ్చని పేర్కొంది.