సర్వేకు నేను దూరం : డీకే అరుణ
బీజేపీ పార్లమెంటు సభ్యులు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన కుటుంబ వివరాలను ఇవ్వడం లేదని తెలిపారు;

బీజేపీ పార్లమెంటు సభ్యులు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన కుటుంబ వివరాలను ఇవ్వడం లేదని తెలిపారు. ఎన్యుమరేటర్లు వచ్చినా తాను వారికి తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను అందించబోనని తెలిపారు. గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే వివరాలను బయట పెట్టాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
ఉపయోగం ఏముంది?
ఈ సర్వే వల్ల ఉపయోగం లేదని డీకే తెలిపారు. బీసీలకు ఉపయోగం ఉంటుందని చెబుతున్నప్పటికీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. అందుకే తాను సమగ్ర సర్వేకు తన కుటుంబ వివరాలను అందించబోనని తెలిపారు. ఎవరూ తమ ఇంటికి రావాల్సిన అవసరం లేదని కూడా డీకే అరుణ తెలిపారు.