Kalvakuntla Kavitha : సీబీఐ విచారణపై కోర్టును ఆశ్రయించిన కవిత
తనను సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు
తనను సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ దరఖాస్తు తమకు ఇవ్వలేదని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. సిబీఐని తీహార్ జైలులోనే విచారించాలని నిన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ను కోర్టు బుధవారం విచారించే అవకాశముంది.
లిక్కర్ స్కామ్ లో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత ఈడీ అధికారులు ఆమెను విచారించిన అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించింది. అయితే సీబీఐ తాము విచారించాలని కోరడంతో కోర్టు అంగీకరించింది. దీనిపై కవిత అభ్యంతరం తెలుపుతూ పిటీషన్ వేశారు.