నాకేం సంబంధం : కవిత

9 గంటల పాటు జరిగిన విచారణలో తనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు;

Update: 2023-03-12 04:33 GMT

తొమ్మిది గంటల పాటు జరిగిన విచారణలో తనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన కవిత అసలు తనకు సంబంధమే లేని విషయంపై తాను ఎలా చెప్పగలని ప్రశ్నించారని చెబుతున్నారు. తాను ఫోన్లను ధ్వంసం చేయలేదని కూడా ఈడీ అధికారులకు ఆమె చెప్పినట్లు తెలిసింది. ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ కవిత సమాధానమిచ్చారు.

నాకు తెలియదు...
కొన్ని ప్రశ్నలకు మాత్రం తనకు తెలియదని, తనకేం సంబంధం అంటూ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈడీ విచారణ తొమ్మిది గంటలు సాగింది. కవిత స్టేట్‌మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. అనంతరం ఆమె హైదరాబాద్ కు బయలుదేరి వచ్చి తన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈరోజు కలవనునట్లు తెలిసింది. అయితే ఈ నెల 16వ తేదీన కవిత మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంది.


Tags:    

Similar News