నేడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి .. రాజీనామా చేసి
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు;

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.అయితే ఈ సందర్భంగా కేశవరావు తన ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను రాజీనామా లేఖను పార్టీలో చేరిన తర్వాత పంపనున్నారు.
రాజ్యసభ పదవికి...
బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించిన కేశవరావు కొన్నాళ్ల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో కేకే కాంగ్రెస్ లో చేరతారని అప్పుడే ప్రచారం జరిగినా ఈరోజు పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు.