KTR : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ లెటెస్ట్ ట్వీట్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఎక్స్ లో స్పందించారు

Update: 2024-12-15 05:32 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఎక్స్ లో స్పందించారు. "బ్యాగు నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన తర్వాత, అందరూ అదే అనుభవించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందని అనిపిస్తోంది.తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పైన, తమ కంపెనీ కార్యకలాపాల పైన ఆ పథకం యొక్క ప్రభావాన్ని వ్యక్తపరిచినందుకు ఎల్ అండ్ టి వంటి ప్రముఖ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని జైలుకు పంపిస్తాను అంటూ ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు" అంటూ ట్వీ చేశారు.

పెట్టుబడులు పెట్టిన వారినే...
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల అధిపతులను జైలుకు పంపిస్తానంటూ రేవంత్ బెదిరింపులకు పాల్పడడం సరైనది కాదని, రేవంత్ రెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు దిగజారుతున్న ఆయన మానసిక స్థితికి అర్ధం పడుతున్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇలాంటి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలతో రేవంత్ పరిశ్రమలకు ఏ సందేశం పంపుతున్నాడు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 
ఇదేనా రాహుల్ గాంధీ దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ పార్టీ ముఖ్యమంత్రులకు నేర్పించిన గొప్ప వ్యూహమంటూ కేటీఆర్ సెటైర్ వేశారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News