కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి
కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మరణించారు
కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కొత్త దంపతులు మరణించారు. వీరితో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మరణించారు. తెలంగాణ నుంచి శబరిమల వెళుతున్న బస్సును కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కొత్తగా పెళ్లయిన యువజంట హనీమూన్ కోసం కేరళకు వెళ్లారు.
నవ దంపతులు...
అయితే కేరళలోని పతినంతిట్ట వద్ద అయ్యప్పలకు చెందిన బస్సును ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురు చనిపోయారు. మృతులు నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. తెలంగాణకు చెందిన వారు కేరళ ట్రిప్ కు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అతి వేగమే ప్రమాదానికి గల కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే్స్తున్నారు.