కేసీఆర్ కు పీసీసీ చీఫ్ బహిరంగ లేఖ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు

Update: 2024-12-15 07:43 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్.. తన పదేళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారం చేపట్టి గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగుల్చారన్న మహేష్ కుమార్ గౌడ్ సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమై కేసీఆర్ పాలన సాగించారని విమర్శలకు దిగారు.

అవినీతికి అడ్డు అదుపు లేకుండా...
బీఆర్ఎస్ హయాంలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని, పెత్తందారు సర్కార్ తో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడారనిమహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కానీ కేసీర్ లోనూ, ఆయన కుటుంబ సభ్యుల్లో, బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇదే పంథా కొనసాగితే తగిన సమయంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News