భూపాలపల్లి జిల్లాలో దారుణం....!!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..!!‌ కళ్ళలో కారంపొడి చల్లి మరీ, గొడ్డలితో నరికి హత్య చేసారు..!!!

Update: 2024-12-14 10:24 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..!!‌ కళ్ళలో కారంపొడి చల్లి మరీ, గొడ్డలితో నరికి హత్య చేసారు..!!!

స్థానికంగా ఉన్న ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.....

కాటారం మండలంలోని దేవరాం పల్లి గ్రామానికి చెందిన సారయ్య (55)ని అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు కళ్ళలో కారంపొడి చల్లి,గొడ్డళ్ళతో నరికి కిరాతకంగా హత్య చేసారు....!!!!

సంఘటన జరిగిన అనంతరం, స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడికి చేరుకున్న కాటారం ఎస్సై మ్యాక అభినవ్ ,ఘటనా స్థలాన్ని పరిశీలించి, హత్య ఎందుకు జరిగింది అనే కోణంలో విచారణ మొదలు పెట్టారు...!!!

అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మహదేవ్ పూర్ సామాజిక ఆస్పత్రికి తరలించారు..


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News