గ్రూప్ -2 పరీక్షలు రేపే....!!!

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించేందుకు టీజీపిఎస్సీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది....!!!

Update: 2024-12-14 08:39 GMT


తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించేందుకు టీజీపిఎస్సీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది....!!! ఈ పరీక్షలు రేపటి నుండి రెండు రోజుల పాటూ..15,16 తేదీళ్ళో నిర్వహించనుంది...!!!

మొత్తం 783 గ్రూప్ -2 సర్వీసు పోస్టుల భర్తీకి రెండు రోజుల పాటు నాలుగు పేపర్లు రాసే విధానం నిర్వహించబడుతుంది....!!!

TGPSC ఈ పోస్ట్ ల భర్తీకి డిసెంబర్ 29 ,2022 నా ప్రకటన విడుదల చేసింది.మొత్తం 5,51,943 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు..!!

రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షల నిర్వహణకు 1368 కేంద్రాలను ఓఎంఆర్ పద్దతిలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది..!!

ఒక్కోపేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు 600 మార్కులకు జరుగుతుంది.

పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి.

పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది.

హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు తీసుకురావాలని తెలిపింది.

మంగళసూత్రం, గాజులు ధరించవచ్చని, అభ్యర్థులు చెప్పులు వేసుకుని రావాలని సూచించింది.

అభ్యర్థులందరూ బయోమెట్రిక్‌ తప్పనిసరి వేయాలని లేదంటే ఓఎంఆర్‌ పత్రాలు మూల్యాంకనం చేయబోమని తెలిపింది.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

https://www.telugupost.com/telangana/he-is-my-favorite-hero-1561071

Tags:    

Similar News