ఈ దెబ్బతో... వాళ్ళ ఓటు బ్యాంకు సొంతం చేసుకున్నారు..!!??

Update: 2024-12-14 07:36 GMT

తెలుగు రాష్ట్రాలలో ఫాన్స్ వార్స్ తరచుగా చూస్తూ ఉంటాం....ఈ మధ్య ఎక్కువగా మెగా మరియు అల్లు అభిమానులు తరచుగా సోషల్ మీడియాలో గొడవలు పడటం చూస్తూ ఉన్నాం... మేము గోప్పా అంటే... మేం గొప్ప అని....మా వల్లే మీరు ఈ పొజిషన్ లో ఉన్నారని వీళ్ళు... లేదు మా వల్లే అని అల్లు అభిమానులు.... ఒకానొక సందర్భంలో ఈ చిన్న చిన్న గొడవలు కాస్త,గాలి దుమారం లా తయారయి ఇక నుంచి మెగా సినిమాలకి,అల్లు వారి సినిమాలకి సంబంధం లేదు అన్నట్లు పోస్ట్ లు, లెటర్స్ లాంటివి కూడా ప్రచారం చేశారు...!!

కానీ వీటన్నిటిపై అటు మెగా ఫ్యామిలీ వాళ్ళు,అటు అల్లు ఫ్యామిలీ వాళ్ళు ఎవరూ స్పందించక పోవటం విశేషం...!!!!

వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ... తెలంగాణ ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీసుకున్న నిర్ణయానికి మెగా అభిమానుల ఓటు బ్యాంకు ని సొంతం చేసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!!

పుష్పా-2 ప్రీమియర్ షో లో ఎవ్వరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి రావటంతో... అభిమానులు ఒక్క సారిగా తన కాన్వాయ్ చుట్టూ చేరటంతో రేవతి అనే మహిళ అక్కడిక్కడే మరణించారు.తన కుమారుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో ఉన్నాడు...!! ఈ ఘటనలో తెలంగాణ పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం మరియు అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు.... అప్పటి వరకు నిప్పులు కక్కుతున్న మెగా అభిమానులు.. అల్లు అర్జున్ క్షేమంగా తిరిగి వచ్చేయాలని కోరుకున్నారు.... సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు...!!

తెలంగాణ ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ చేసిన పని వల్ల... మెగా కుటుంబం ఒకటి అయిందని హర్షాభావం వ్యక్తం చేస్తున్నారు...!!!


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News